బూతు సైట్లు ఇక్కడ నిషేదం..

274
Online News Portal
Porn site access blocked at Patna
- Advertisement -

ప్రయాణీకులు రైల్వే సమాచారం, ఇతర అవసరాలను ఉచిత ఇంటర్నెట్ ద్వారా తీర్చుకుంటారని ఆశించి వైఫై ఏర్పాటుచేస్తే దాని ద్వారా పోర్న్ సైట్స్ ఎక్కువగా వెతుకుతున్నారని రైల్ టెల్ సర్వేలో వెల్లడైంది. దీంతో పాట్నా రైల్వే స్టేషన్ పరిధిలో పలు సైట్లను బ్లాక్ చేస్తున్నట్లు తూర్పు మధ్య రైల్వే సంస్థ ప్రకటించింది. సాంకేతిక పరిజ్ఞానంతో ముడిపడి జీవితాలు సాగుతున్న నేటి రోజుల్లోరైల్వే స్టేషన్ లలో ఉచితంగా ఇంటర్నెట్ వైఫై సేవలు కల్పిస్తే పోర్న్‌ చూడ్డానికి వాడుతున్నారట.

Porn

బిహార్‌లోని పాట్నా రైల్వే జంక్షన్‌లో ఇది మరి ఎక్కువగా ఉందని సర్వేలో వెల్లడైంది. ‘మేం ఏ ఉద్దేశంతో అయితే ప్రయాణికుల సౌకర్యార్థం వైఫై సేవలు ప్రారంభించామో దురదృష్టంకొద్ది అందుకోసం కాకుండా చెడు కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారు. ఈ పరిస్థితి ముఖ్యంగా పాట్నా రైల్వే జంక్షన్ లో ఎక్కువగా ఉంది. అందుకే అక్కడ పలు సైట్లను బ్లాక్ చేస్తున్నాం’ అని తూర్పు మధ్య రైల్వే సీపీఆర్వో అరవింద్ రాజక్ మీడియాతో చెప్పారు. ఈ ఏడాదే ఇక్కడ వైఫై సేవలు ప్రారంభించారు.

ఈ జంక్షన్ లోకి వచ్చిన ప్రతి వ్యక్తికి ఉచితంగా 1జీబీ వరకు వైఫై సేవలు ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఈ సౌకర్యాన్ని 10 జీబీ వరకు పెంచేందుకు అధికారులు యోచన చేస్తున్నారు. వంద ప్రధాన రైల్వేస్టేషన్లలో ఇప్పటికే ఉచిత వై ఫై సౌకర్యం కల్పించిన రైల్వే అధికారులు దేశవ్యాప్తంగా వచ్చే మూడేళ్లలో మొత్తం 400 రైల్వే స్టేషన్లలో ఉచిత ఇంటర్నెట్ సదుపాయాన్ని అందుబాటులోకి తేనున్నట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

- Advertisement -