అందుకే ఐటమ్‌కు రెఢీ అంటున్న పూజా..

215
- Advertisement -

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్స్ చాలామంది ఐటమ్ సాంగ్స్ చేయడానికి ఆసక్తిని చూపుతున్నారు. తమన్నా .. కాజల్ ఐటమ్ సాంగ్స్ తోను దుమ్మురేపేస్తున్నారు. ఇక ఆ బాటలోనే రాశి ఖన్నా కూడా అడుగులు వేస్తోంది. ‘రాజా ది గ్రేట్’ సినిమా కోసం ఆమె ఐటమ్ సాంగ్ చేసింది. ఇక పూజా హెగ్డే కూడా ఐటమ్ సాంగ్ చేయడానికి రెడీ అవుతోంది.

Pooja Hegde's Item Song in Rangasthalam?

పూజా ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు తాజాగా రామ్ చరణ్ రంగస్థలంలో ఐటమ్ సాంగ్ చేసే అవకాశం పూజాకు దక్కిందని సమాచారం. అయితే మంచి ఫామ్ లో ఉన్న ఈ బ్యూటీ రంగస్థలం లో ఆడిపాడేందుకు కేవలం 30 లక్షలే పుచ్చుకోవడం అందరీకి ఆశ్చర్యం కలిగించినా అసలు కిటుకు వేరే ఉందని అంటున్నారు. రామ్ చరణ్ – కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాలో పూజాహెగ్థేకి హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తామంటూ కమిట్ మెంట్ ఇవ్వడంతో ఈ భామ ఇప్పుడు రంగస్థలంలో ఐటమ్ సాంగ్ చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిందని అంటున్నారు. మరి అభిమానులు పూజాహెగ్థేను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

- Advertisement -