ఎన్టీఆర్ తో పూజా హెగ్డే?

211
Pooja-Hegde-jr-ntr
- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే మొదట ఈ సినిమాలో హీరోయిన్‌గా అను ఎమ్మాన్యూయల్‌ను తీసుకోనున్నారనే మాటలు వినిపించాయి.

Pooja-Hegde-jr-ntr

కానీ తాజా సమాచారం ప్రకారం డిజె బ్యూటీ పూజా హెగ్డేను రంగంలోకి దింపనున్నారని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ‌.. బెల్లంకొండ శ్రీ‌నివాస్‌తో ‘సాక్ష్యం’ అనే సినిమా చేస్తోంది. శ్రీ‌వాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. దీంతోపాటు.. రామ్‌చ‌ర‌ణ్‌తో సుకుమార్ రూపొందిస్తున్న ‘రంగ‌స్థలం 1985’లోనూ పూజా ద‌ర్శ‌నమివ్వ‌నుంది. స‌మంత హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో పూజా ఓ ప్ర‌త్యేక గీతం చేసింది. ఎన్టీఆర్ సినిమాతో పాటు మహేష్ బాబు-వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాలో కూడా హీరోయిన్‌గా పూజానే తీసుకోవాలని అనుకుంటున్నారు. ఒకవేళ ఈ రెండు సినిమాల షూటింగ్‌లు గనుక క్లాష్ అయితే సమస్య వస్తుందేమో అని ఆలోచిస్తున్నారు.

Pooja-Hegde-and-NTR

దీంతో త్రివిక్రమ్ పూజాతో పాటు మరో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌ను కూడా లైన్‌లో పెట్టినట్లు టాక్. అయితే అనుపమను సేఫ్ సైడ్ మాత్రమే పెట్టుకున్నట్లు దాదాపుగా పూజా హెగ్డేనే తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పూజా గనుక రెండు సినిమాలకు డేట్స్‌ను సరిగ్గా అడ్జస్ట్ చేయగలిగితే రెండు క్రేజీ సినిమాలు ఆమె సొంతం కావడం ఖాయం.ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ 25వ సినిమా అజ్ఞాతవాసి షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. కీర్తి సురేష్ – అను ఇమ్మానుయేల్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. పవన్ తో చేస్తున్న చిత్రం పూర్తయ్యాక త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నాడు.

- Advertisement -