మరోసారి బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన పూజా..!

206
pooja hegde

టాలీవుడ్- బాలీవుడ్ ప్రస్తుతం పూజా హెగ్డే జపం చేస్తోంది. ఈ భామ నటించిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవుతుండటంతో పూజా డిమాండ్ బాగా పెరిగిపోయింది. సంక్రాంతి రేసులో అల వైకుంఠపురములోతో హిట్ కొట్టిన పూజా తాజాగా బాలీవుడ్ ఆఫర్ కొట్టేసింది.

అక్షయ్ కుమార్ సరసన నటించే అవకాశాన్ని కొట్టేసింది. బీ టౌన్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అక్షయ్ కుమార్ హీరోగా బచ్చన్ పాండే మూవీ తెరకెక్కుతుండగా సాజిద్ నదియాద్ వాలా నిర్మిస్తుండగా ఒక హీరోయిన్‌గా కృతి సనన్ నటిస్తోంది.

ఈ మూవీలో మరో హీరోయిన్‌ కోసం పూజాను సంప్రదించగా ఆమె ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో పూజా పాత్ర కీలకంగా ఉండనుందని టాక్. ఇక ప్రస్తుతం పూజా…ప్రభాస్‌తో సినిమాతో పాటు అఖిల్ మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది.