ప్రభాస్‌కి జోడిగా బాలీవుడ్‌ బ్యూటీ..

254
- Advertisement -

రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్నసాహో మూవీని నేషనల్ లెవెల్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దనున్నారు. బాహుబలి2 తర్వాత ప్రభాస్ చేస్తున్న మూవీ ఇదే అవ్వడంతో అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇందుకు బాలీవుడ్ హీరోయిన్ కోసం బాగానే వేటాడుతున్నారు సాహో టీం. కొందరు భామలను సంప్రదించారు కానీ.. ప్రభాస్ పక్కన చేసేందుకు వాళ్లు ఎక్కువ మొత్తం అడగంతో సాహో మేకర్స్ సైలెంట్ అయ్యారు. ఇప్పుడీ అవకాశాన్ని పూజా హెగ్డేకి ఇవ్వాలని అనుకుంటున్నారట.

Pooja Hegde roped in for Saaho?

మరి ఈ భామ ‘ఒక లైలా కోసం’ అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించిన పూజా హెగ్డే.. ముకుందలో కూడా పక్కింటి అమ్మాయి పాత్రలో కనిపించింది. కానీ రీసెంట్ డీజే సినిమాలో అల్లు అర్జున్‌ సరసన హీరోయిన్‌గా చేస్తుంది.అయితే ఈ మద్య రిలీజ్ అయిన అల్లు అర్జున్ మూవీ డీజే సాంగ్ ప్రోమోలో.. పూజా కొత్తగా కనిపించింది. గ్లామరస్ అవతారంలో పూజా హెగ్డే బాగా మెప్పించిందనే సంగతి అర్ధమైంది. అందుకే ఇప్పుడు సాహో చిత్రంలో హీరోయిన్ అవకాశాన్ని ఈమెకు ఆఫర్ చేయాలని చూస్తున్నారట. ఈ భామకు ఎలాగూ బాలీవుడ్‌లో మంచి గుర్తింపు ఉంది. మొహెంజొదారో చిత్రంలో హృతిక్ రోషన్ పక్కన నటించడం ద్వారా నేషనల్ రేంజ్ గుర్తింపు సంపాదించుకుంది.

నార్త్ లో కూడా బన్నీకి డిమాండ్ ఎక్కువ కాబట్టి.. ఇప్పుడు బన్నీ హీరోయిన్ గా కొత్త క్రేజ్ కూడా వస్తుంది. అందుకే సాహో హీరోయిన్ ఛాన్స్ ను పూజా హెగ్డే చేతిలో పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈభామ ఎంత డిమాండ్‌ చేస్తుందో చూడాలి.

- Advertisement -