పూజాగాంధీ “ఆపిల్” ఫస్ట్‌లుక్..

120
Pooja Gandhi

పూజాగాంధీ ప్రధాన పాత్రలో బండి వెంకటరెడ్డి సమర్పణలో, శంకర్ దర్శకత్వంలో బాసర రవి చిన్న నిర్మించిన చిత్రం “ఆపిల్.” ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ నిర్మాత రాజకందుకూరి ఇటీవలే హైద్రాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు సాగర్ కూడా పాల్గొన్నారు.

Apple Movie First Look

 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రవి చిన్న మాట్లాడుతూ.. “ఇదొక వెరైటీ చిత్రం. పూజాగాంధీ నటన ఈ చిత్రానికి హైలెట్. జేమ్స్ అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. మా పోస్టర్‌ను విడుదల చేసిన రాజ్ కందుకూరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాం. జులైలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రనున్నాం.”అని అన్నారు.

Pooja Gandhi

పూజాగాంధీ, యశస్, నాగేంద్ర, విజయచందర్, శోబరాజ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:ఏం ఆర్ శీను, సంగీతం:జేమ్స్, కో ప్రొడ్యూసర్స్: శంకరబాబు, కంద్యనం శ్రీకాంత్ ,సమర్పణ:బండి వెంకట రెడ్డి, నిర్మాత:బాసర రవి చిన్న, దర్శకత్వం:శంకర్.