గోదావరి జలాలతో చెరువులు పరవళ్లు తొక్కుతున్నాయి

431
- Advertisement -

గోదావరి జలాలతో రాష్ట్రంలోని చెరువులు, కుంటలు పరవళ్లు తొక్కుతున్నాయని అన్నారు రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి హరీశ్ రావు. ఈరోజు సూర్యపేట జిల్లాలోని పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గోన్నారు మంత్రి హారీశ్ రావు. అనంతరం తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని రుద్రమ చెరువును పరిశీలించారు. ఈ పర్యటనలో మంత్రి హరీష్‌తో పాటు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, స్థానిక ఎమ్మెల్యే గాధారి కిశోర్ కుమార్ తదితరులు ఉన్నారు.

Harish Rao

ఈసందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కేవలం మూడు ఏండ్లలోనే పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్ దే అన్నారు. రాత్రింబవళ్లు కష్టపడి కాళేశ్వరం ప్రాజెక్ట్ ను పూర్తి చేసి దేశానికే ఆదర్శంగా నిలిచామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్ధానంలో ఉందన్నారు. తెలంగాణ సాధించుకున్నాక.. మన నీళ్లు, నిధులు, నియామకాలు సాధించుకుంటున్నామన్నారు.

తెలంగాణ దాహర్తిని తీర్చేందుకు, ప్రతి చేనుకు నీరందించడమే లక్ష్యంగా ప్రాజెక్టు నిర్మించారని మంత్రి పేర్కొన్నారు. గోదావరి నీటిని వృథా కానివ్వకుండా కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టి రికార్డు స్థాయిలో నీటిని నిల్వ చేస్తున్నామని మంత్రి తెలిపారు. అంతకు ముందు తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామంలో వర్డెల్లి వెంకటేశ్వర్లు రచించిన ‘పిట్టవాలిన చెట్టు’ అనే పుస్తకాన్ని మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి ఆవిష్కరించారు.

- Advertisement -