ఫ్రీ స్కూటీ స్కీం.. అంతా ఫేక్

116
free scoty scheme

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొత్త పథకాన్ని ప్రారంభించారని మహిళలకు ఉచితంగా స్కూటీలు ఇస్తున్నారని కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇక ఈ స్కూటీలు పొందాలనుకునేవారు మీసేవ కేంద్రానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని ప్రచారం జరగడంతో లక్షలాది మంది మహిళలు మీ సేవ కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. పదో తరగతి పాస్ అయి 18 ఏళ్ల నుండి 40 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు ఈ పథకాన్ని పొందడానికి అర్హులు అని వార్తలు వచ్చాయి.

Pm scooty Yojana scheme

ఇక ఈ వార్త పత్రికలలో సైతం ప్రచురితమైంది. దీంతో ఉచిత స్కూటీ పథకాన్ని పొందడం కోసం మీ సేవ కేంద్రాల వద్దకు మహిళలు పరుగులు పెడుతున్నారు. అయితే ఆ ప్రకటన ఓ అసత్య ప్రచారమని అధికారులు స్పష్టం అలాంటి పథకమేమీ లేదని మహిళాశిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌ విజయేంద్ర బోయి స్పష్టం చేశారు. మరోవైపు సోషల్‌ మీడియాలో ‘ఫేక్‌ న్యూస్‌’ను గుర్తించే సంస్థ ‘ఫ్యాక్ట్‌లీ’కూడా ‘ఉచిత స్కూటీ’పై ఓ పత్రికలో వచ్చిన కథనం అసత్యమని తేల్చింది. దీంతో మహిళల్లో గందరగోళం మొదలైంది.