దేశ ప్రజలు మీకు అండగా ఉంటారుః మోదీ

202
modi

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 చివరి నిమిషంలో విఫలమైన సంగతి తెలిసిందే. ఈసందర్బంగా బెంగుళూరులోని ఇస్రో కార్యాలయంలో శాస్త్రవేత్తలను కలిసి అభినందించారు ప్రధాని మోదీ. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. చంద్రుడిని తాకాలనే మన ఆకాంక్ష ఇప్పుడు మరింత బలపడిందని… రానున్న రోజుల్లో మనం ఘన విజయాలను సాధిస్తామని అన్నారు. భార‌త మాత విజ‌యం కోసం ఇస్రో శాస్ర్తవేత్తలు తీవ్రవైన కృషి చేశారు.

మీరెన్నో రోజుల నుంచి నిద్ర లేని రాత్రులు గ‌డిపారు. మ‌న ల‌క్ష్యం నుంచి దూరం కావాల్సిన అవ‌స‌రం లేదు. చంద్రుడిని చేరుకునే ల‌క్ష్యాన్ని వ‌దిలేది లేద‌న్నారు. భార‌త‌ ప్ర‌జ‌లారా.. గ‌త కొన్ని గంట‌ల నుంచి యావ‌త్ దేశం దిగ్భ్రాంతికి లోనైంది. మ‌న శాస్త్ర‌వేత్త‌లు ఎంతో కృషి చేశారు. మ‌నం మ‌న ల‌క్ష్యానికి ఎంతో ద‌గ్గ‌ర‌కు వ‌చ్చాం. కానీ ఇంకా ఎంతో చేయాల్సి ఉంది. మీరు వీలైనంత ద‌గ్గ‌ర‌గా చంద్రుడి వ‌ద్ద‌కు వెళ్లారు.

ఇస్రో శాస్త్ర‌వేత్త‌ల కుటుంబాల‌కు సెల్యూట్ చేస్తున్నాన‌న్నారు. మ‌న దేశం ఎన్నో క‌ఠిన సంద‌ర్భాలను ఎదుర్కొన్న‌ది.. కానీ ఆ సంఘ‌ట‌న‌లు ఎప్పుడూ మ‌న స్పూర్తిని దెబ్బ‌తీయ‌లేద‌న్నారు. మీ ప్ర‌య‌త్నాలు విలువైన‌వ‌ని గ‌ర్వ‌ప‌డుతున్నాను. చంద్ర‌యాన్ యాత్ర అద్భుతంగా సాగింద‌న్నారు. మ‌న ఆర్బిటార్ ఇంకా చంద్రుడి చేరువ‌లోనే ఉంద‌న్నారు. మంగ‌ళ గ్ర‌హంపై భార‌తీయ జెండాను నిలిపింది మీరేన‌ని మోదీ అన్నారు. చంద్ర‌యాన్ కూడా చంద్రుడిపై నీళ్లు ఉన్నాయ‌ని చెప్పింద‌న్నారు.