మోడీని రాముడిగా.. ష‌రీఫ్‌ను రావ‌ణుడిగా

243
- Advertisement -

పాకిస్తాన్‌ను ఊహించనిరీతిలో విస్మయపరచడంలో నరేంద్రమోదీని మించిన నాయకుడు లేరంటే అతియోశక్తి కాదేమో. సెప్టెంబర్‌ 18న 18మంది సైనికుల్ని పొట్టనబెట్టుకున్న ఉడీ ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాక్‌ను ఇరకాటంలో నెట్టేందుకు దౌత్యపరమైన మార్గాల్లోనే ఎన్డీయే ప్రభుత్వం ముందుకు సాగుతోందని అందరూ భావించారు. సైనిక చర్యలాంటి తీవ్రమైన నిర్ణయాలు ఉండకపోవచ్చునని దేశ ప్రజలు కూడా నిర్ధారణకు వచ్చేలోపే.. అనూహ్యంగా సైన్యం పాకిస్థాన్‌ భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ ఉగ్రవాద శిబిరాలపై ’సునిశిత దాడులు’ (సర్జికల్‌ స్ట్రైక్స్‌) జరిపింది. కేవలం దాడులతోనే కాకుండా దౌత్యపరంగా ప్రపంచ దేశాల్లో పాక్‌ను ఏకాకి చేసేందుకు వ్యూహాలు పన్నుతూ.. ఆ దేశాన్ని ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని అమెరికాపై ఒత్తిడి తెస్తూ.. మరోవైపు సైనిక శక్తితో ఉగ్రవాదులు ఏరి వేశారు మోడీ.

  modisharifkejri2

పాక్ చుట్టూ ఉచ్చూ బిగిస్తూ.. ఆ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేశారు. దీంతో విజయదశమికి ఈ దాడిని సెలబ్రేట్ చేసుకోవాలని శివ‌సేన కార్య‌క‌ర్త‌లు నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగా భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని రాముడిగా, పాకిస్థాన్ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్‌ను రావ‌ణుడిగా, ఆప్ అధినేత‌, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను మేఘ‌నాథుడిగా పోలుస్తూ వార‌ణాసిలో పోస్ట‌ర్లు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి.

modisharifkejri1

శివ‌సేన వార‌ణాసి శాఖ పేరుతో ఈ పోస్ట‌ర్లు అచ్చ‌య్యాయి. మ‌రో స‌ర్జిక‌ల్ ఆప‌రేష‌న్ జ‌ర‌గాల్సిందేన‌ని ఆ పోస్ట‌ర్‌లో శివ‌సేన కార్య‌క‌ర్త‌లు అభిప్రాయ‌ప‌డ్డారు. రాముని రూపంలో ఉన్న మోదీ.. రావ‌ణ రూపంలో ఉన్న పాకిస్థాన్ అంతు చూడాల‌ని ఆకాంక్షించారు. ఇప్పుడు వార‌ణాసి న‌గ‌రం ఎక్క‌డ చూసినా ఇవే పోస్ట‌ర్లు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి.

pm-modi-varanasi-poster-2_650x400_71475659577

- Advertisement -