కరోనా.. ‘మన్‌ కీ బాత్‌’లో ప్రధాని ప్రసంగం..

406
modi
- Advertisement -

భారత్‌లో కరోనా కేసులు క్రమంగా పెరుతున్న నేపథ్యంలో లాక్‌డౌనే కరోనా వైరస్‌ నివారణకు పరిష్కార మార్గమని దేశ ప్రధాన మంత్రి నరేంద్ర అభిప్రాయం వ్యక్తం చేశారు. మోదీ మన్‌ కీ బాత్‌లో ప్రజలతో మాట్లాడారు. కరోనాపై పోరులో భాగంగా లాక్‌డౌన్‌ వంటి అసాధారణ నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోందని, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తనను క్షమించాలని వ్యాఖ్యానించారు.

తనపై కొందరు ఆగ్రహంతో ఉన్నారని తనకు తెలుసని అన్నారు. అయినప్పటికీ, కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ఈ కఠిన చర్యలు తీసుకోకతప్పదని చెప్పారు.కరోనా ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమైనది కాదని, కొందరు ఇప్పటికీ సీరియస్‌నెస్‌ను అర్థం చేసుకోవడంలేదని అన్నారు. ప్రజలు నిబంధనలు బేఖాతరు చేస్తే ఇతరులకు ఇబ్బంది తప్పదని మోదీ వ్యాఖ్యానించారు.

ముఖ్యంగా పేద ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మోదీ గుర్తు చేశారు. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్నది జీవన్మరణ సమస్య అయినందువల్లే కఠిన నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. వైరస్ వ్యాప్తి ప్రారంభమైన రోజుల్లో చర్యలు తీసుకుంటేనే కరోనాను తొలగించవచ్చని అన్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే దేశ ప్రజలు కొన్ని రోజులు లక్ష్మణ రేఖ దాటొద్దని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ప్రతిఒక్కరూ ధైర్యంతో కరోనాపై పోరాడాలని పిలుపుఇచ్చారు. కరోనా వైరస్‌ కట్టడికి వైద్యులు, నర్సులు…ఇతర వైద్య సిబ్బంది చేస్తున్న కృషి అభినందనీయమని మోదీ వ్యాఖ్యానించారు.

- Advertisement -