ఆటో డ్రైవర్‌గా మారిన మోడీ..!

150
modi auto driver

ఇదేంటి ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆటో డ్రైవర్‌గా మారడం ఏంటనుకుంటున్నారా…?అచ్చం మోడీలా కనిపించే ఈ ఆటోడ్రైవర్‌ ఇప్పుడు టాక్‌ ఆఫ్ ది న్యూస్‌గా మారాడు. మోడీ పోలీకలతో ఉన్న ఈ ఆదిలాబాద్‌ డ్రైవర్‌  ప్రధాని తమ్ముడంటూ సోషల్‌ మీడియాలో న్యూస్ వైరల్‌గా మారింది.

అచ్చం ప్రధాని  పోలికలతో ఉన్న ఈ డ్రైవర్ పేరు అయూబ్. 1998లో ఆర్టీసీలో కాంట్రాక్ట్ డ్రైవర్‌గా చేరారు. కానీ కొన్నేళ్ల తర్వాత ఉద్యోగం కోల్పోయిన ఆయన.. లారీ డ్రైవర్‌గా, ఆటో డ్రైవర్‌గా మారారు. 2014లో తెలంగాణ వచ్చాక అదిలాబాద్ డిపోలో డ్రైవర్‌గా మళ్లీ ఉద్యోగంలో చేరారు.

ప్రధాని మోడీ పోలికలతో ఉండటంతో జనం తనతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపుతున్నారని అయూబ్ తెలిపారు. అచ్చం మోడీలా ఉన్నారనే ప్రచారంతో మొదట్లో కొంచెం భయంగా ఉండేదన్నారు. కానీ తర్వాత అంతా పాజిటివ్‌గా రిసీవ్ చేసుకోవడం ఆనందంగా ఉందనిపించిందన్నారు. ఇక మోడీ పోలికలతో ఉండటంతో అయూబ్‌ని ఎన్నికల ప్రచారానికి సైతం బీజేపీ నేతలు ఉపయోగించుకున్నారు. మోడీ తమ్ముడు అంటూ సోషల్ మీడియాలో ప్రస్తుతం అయూబ్ ఫోటోలు వైరల్‌గా మారాయి.

modi