హ్యాపీ బర్త్ డే ….’ఇండియా’

265
Modi
- Advertisement -

అదేంటి ఇండియా పుట్టినరోజు ఏంటీ అనుకుంటున్నారా..?మీరు చదువుతోంది నిజమే కానీ మనదేశం పుట్టినరోజు కాదు. ఇండియా అంటే దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ ముద్దుత కుతూరు  పుట్టినరోజు. 2015 ఏప్రిల్ 23న ముంబైలో పుట్టింది జాంటి కూతురు. దీంతో  జాంటీరోడ్స్ అతని భార్య కలిసి ఆ చిన్నారికి ‘ఇండియా జియాన్నే’ అని పేరు పెట్టారు. తమకు భారతదేశమంటే చాలా గౌరవమని, ఇక్కడి సంస్కృతి, సాంప్రదాయాలు తమకు చాలా నచ్చాయని అందుకే తమ కూతురికి ఇండియా అని పేరు పెట్టామని చెప్పారు జాంటీ. తన కుతురు రెండో పుట్టినరోజు సందర్భంగా విష్‌ చేస్తూ దిగిన ఫోటోను ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు జాంటీ.

PM Modi's Birthday Wish For India

అంతే సోషల్ మీడియాలో ఏకంగా 1.2 బిలియన్ మంది ఇండియాకు పుట్టినరోజు విషెస్ చెప్పారు. వీరిలో భారతప్రధాని నరేంద్రమోడీ కూడా ఉన్నారు.హ్యాపీ బర్త్ డే ఇండియా… ఫ్రమ్ ఇండియా అని ట్వీట్ చేశారు.కుమార్తె పుట్టిన రోజు సందర్భంగా జాంటీ ఇండియా పేరిట హోమం కూడా జరిపించాడు.

PM Modi's Birthday Wish For India

- Advertisement -