ప్రధాని చేసిన పనికి ప్రశంసల జల్లు..

289
modi

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం రష్యాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా మోదీ ప్రవర్తించిన తీరుపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అసలు విషయం ఏంటంటే..రష్యాలో వ్లాడివోస్టోక్ నగరంలో జరిగిన ఈస్ట్రన్ ఎకనమిక్ ఫోరమ్(ఈఈఎఫ్) సదస్సుకు ప్రత్యేక అతిథిగా మోదీ హాజరయ్యారు, రక్షణ, భద్రత, అంతరిక్షం సహా 15 అంశాల్లో రష్యాలో ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

ఈఈఎఫ్ సదస్సు అనంతరం అక్కడి అధికారులు ఓ ఫొటో సెషన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మోదీ కూర్చోవడానికి ప్రత్యేకంగా ఓ సోఫా, మిగతావారికి కుర్చీలు ఏర్పాటు చేశారు. అయితే దీన్ని గమనించిన మోదీ, తనకు ప్రత్యేకంగా సోఫా వద్దని సున్నితంగా తిరస్కరించారు. అందరి తరహాలోనే తనకూ కుర్చీ వేయాలని కోరారు. దీంతో ప్రధాని విజ్ఞప్తి మేరకు రష్యా అధికారులు మోదీకి కుర్చీని ఏర్పాటుచేశారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. కాగా, ప్రధాని మోదీ వ్యహరించిన తీరు, నిరాడంబరతపై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.