ప్రధాని మోదీకి అరుదైన అవార్డు..

443
modi
- Advertisement -

భారత ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం దక్కింది. స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి గుర్తింపుగా గ్లోబల్ గోల్‌ కీపర్ అవార్డును ఆయన అందుకున్నారు. న్యూయార్క్‌లో జరిగిన యుఎన్ సర్వసభ్య సమావేశంలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మోదీకి ఈ అవార్డును అందజేశారు. కాగా, ఈ కార్యక్రమానికి కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్ సహా పలువురు హాజరయ్యారు.

pm modi

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడ్లుతూ..ఇది భారతీయులకు లభించిన గౌరవమన్నారు. అవార్డు భారతీయులకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. గాంధీజీ ఆశయాలను ఆచరణలోకి తెస్తున్నట్లు పేర్కొన్నారు. స్వచ్ఛభారత్‌ను ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా గత ఐదేళ్లలో 11 కోట్ల మరుగుదొడ్లు నిర్మించినట్లు తెలిపారు. స్వచ్ఛభారత్ అభియాన్ పథకంతో దేశంలోని పేదలు, మహిళలకు ఎంతో ప్రయోజనం చేకూరుతున్నట్లు ప్రధాని పేర్కొన్నారు.

- Advertisement -