ఫడ్నవీస్,పవార్‌కు మోడీ శుభాకాంక్షలు

352
pm modi

మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన దేవేంద్ర ఫఢ్నవీస్,డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌కు శుభాకాంక్షలు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ.మహారాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం వారు కృషి చేస్తారని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రమాణస్వీకారం అనంతరం మోడీ, అమిత్ షాలకు కృతజ్ఞతలు తెలిపారు సీఎం ఫడ్నవీస్.

శివసేనతో కలిసి ఎన్సీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని..సీఎంగా ఉద్దవ్ ఠాక్రేను స్వయంగా ప్రకటించారు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్. ఇది జరిగిన కాసేపటికే బీజేపీతో కలిసి ఎన్సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం చర్చనీయాంశంగా మారింది.

రెండు రోజుల క్రితం ప్రధాని మోడీతో శరద్ పవార్ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకున్న సంగతి తెలిసిందే. కేవలం రైతు సమస్యలపై మాత్రమే ప్రధానిని కలిశారని పవార్ చెప్పారు. అయితే అక్కడే బీజేపీ – ఎన్సీపీ కూటమికి బీజం పడినట్లు తెలుస్తోంది.

PM Modi congratulates Devendra Fadnavis, Ajit Pawar on becoming Maharashtra CM, Deputy CM…PM Modi congratulates Devendra Fadnavis, Ajit Pawar on becoming Maharashtra CM, Deputy CM