సంయమనం పాటించండి.. దేశ ప్రజలకు ప్రధాని విజ్ఞప్తి

427
- Advertisement -

మరికాసేపట్లో అయోధ్య రామ జన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంపై తుది తీర్పు వెలువడనుంది. ఈనేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రజలు ఈతీర్పు కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తీర్పు వెలువడిన అనంతరం ఎక్కడ ఆవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు అధికారులు. ఉత్తర ప్రదేశ్ లో ఇంటర్నెట్ సేవలను కూడా పూర్తిగా రద్దు చేశారు.

అయోధ్య కేసు వెలువడనున్న నేపధ్యంలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్నప్తి చేశారు. ప్రజలంతా సంయమనం పాటించి.. శాంతిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. అయోధ్యపై ఎలాంటి తీర్పు వచ్చినా.. అది ఒకరి విజయంగానో, మరొకరి ఓటమిగానో పరిగణించకూడదని సూచించారు మోదీ. కోర్టు తీర్పు తర్వాత కూడా మనమంతా కలిసి శాంతి సామరస్యాలను కాపాడుకోవాలన్నారు మోదీ.

- Advertisement -