ఇండియా ఓటమిపై స్పందించిన ప్రధాని మోదీ, రాహుల్..ఏమ్నన్నారంటే?

54
India Loss World Cup

ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఇండియా ఓటమిపాలయిన సంగతి తెలిసిందే. 18పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించింది. లీగ్ మ్యాచ్ లలో ఘన విజయం సాధించిన టీం ఇండియా సెమీస్ లో ఓటమి పాలవ్వడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇక ఇండియా ఓటమిపై పలువురు ప్రముఖులు స్పందించారు. మొదట 45నిముషాలు తాము ఆడిన చెత్త ఆట వల్లే ఓడిపోయామన్నారు టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.

తాజాగా ఇండియా ఓటమిపై స్పందించారు దేశ ప్రధాని నరేంద్రమోదీ. గెలుపోటములు జీవితంలో భాగం అని, మ్యాచ్ ఫలితం అసంతృప్తి కలిగించినా, టీమిండియా కడవరకు పోరాడిన తీరు అకట్టుకుందని పేర్కొన్నారు. భారత జట్టు ఈ టోర్నీ మొత్తం బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో రాణించిందని, ఈ విషయంలో మనందరం గర్వించాలని దేశవాసులకు సూచించారు.

ఇక ఇండియా ఓటమిపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా స్పందించారు. టీమిండియా ఓటమికి వంద కోట్ల భారత హృదయాలు భగ్నమై ఉంటాయని, కానీ మ్యాచ్ లో విజయం కోసం టీమిండియా పోరాడిన తీరు అమోఘమని కొనియాడారు. తమ ప్రేమాభిమానాలకు టీమిండియా అర్హురాలని పేర్కొన్నారు.