లాక్ డౌన్ పొడిగింపుపై మోదీ, అమిత్ షా చర్చ..

354
modi
- Advertisement -

నేడు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. అమిత్‌ షా గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోన్లో సంభాషించారు. ఆయా రాష్ట్రాల్లో లాక్ డౌన్‌ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యల గురించి చర్చించారు. ఈ క్రమంలో అమిత్ షా ప్రధానితో భేటీ కావడం విశేషం.

అయితే ఈ సమావేశంలో మే 31 తర్వాత లాక్ డౌన్ పొడిగింపు అంశంపై ప్రధాని నరేంద్రమోడీకి రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలను మంత్రి అమిత్ షా వివరించారు. కేంద్రం ప్రకటించిన లాక్ డౌన్ 4 ఈనెల 31తో ముగుస్తుంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ మీద నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం మరో రెండు వారాలు లాక్ డౌన్‌ను పొడిగించే అవకాశాలను పరిశీలిస్తోందని సమాచారం. ప్రధాని మోదీ, అమిత్ షా చర్చించిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు.

కాగా ఆదివారం ప్రధాని నిర్వహించనున్న ‘మన్‌ కీ బాత్‌’లో ఈ విషయాన్ని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. నాలుగో విడత లాక్‌డౌన్‌లో సడలింపులు ఎక్కువ కావడం వల్ల దేశంలో వైరస్ వ్యాప్తి ఎక్కువైందన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించిన మంత్రులు, నిపుణులు ఆ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.

- Advertisement -