22న “పిచ్చోడు” వస్తున్నాడు..!

454
Pichodu Movie
- Advertisement -

హేమంత్ ఆర్ట్స్ బ్యానర్ పై హేమంత్ శ్రీనివాస్ నిర్మిస్తోన్న సినిమా పిచ్చోడు. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలయ్యింది. ఫస్ట్ లుక్ కు సోషల్ మీడియాలో మరియు బయట మంచి రెస్పాన్స్ లభిస్తోంది. క్రాంతి, కె.సీమర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో పోసాని కృష్ణ మురళి, సమీర్, సత్యకృష్ణ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్న ఈ మూవీ నవంవర్ 22న గ్రాండ్ గా విడుదల కాబోతోంది.

యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను హీరో సుధీర్ బాబు విడుదల చేశారు. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. హీరో క్రాంతికి ఈ సినిమాతో మంచి పేరు తెచ్చిపెట్టె అవకాశాలు ఉన్నాయి.

- Advertisement -