ఐటమ్‌ సాంగ్‌లో అదరగొట్టిన పాయ‌ల్ రాజ్‌పుత్‌..

296
Payal Rajput
- Advertisement -

RX 100చిత్రంతో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన సొగ‌స‌రి పాయ‌ల్ రాజ్‌పుత్‌.. తేజ ద‌ర్శ‌క‌త్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్, మ‌న్నారా చోప్రా హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్నసీత‌చిత్రంలో ఓ ఐటమ్‌ సాంగ్‌లో న‌టించారు. సినిమా క‌థానుసారం కీల‌క స‌మ‌యంలో..బుల్ రెడ్డి… ` అంటూ సాగే ఈ స్పెష‌ల్ పెప్పీ మాస్ సాంగ్ మాస్ ఆడియెన్స్ స‌హా అన్నీ వ‌ర్గాల ప్రేక్షకుల‌ను మెప్పించేలా తెరకెక్కించారు.. ఈ సాంగ్ తాజాగా విడుదల చేశారు చిత్ర బృంద. ఈ సాంగ్‌లో పాయ‌ల్ సో లో పెర్ఫామెన్స్ హైలైట్‌గా నిలిచింది.

ఈ పాట తెరపై దుమ్మురేపేస్తుందనే అనిపిస్తోంది. మాస్ ఆడియన్స్‌కి కావలసిన అంశాలు పాటలో పుష్కలంగా ఉండటం వలన, మాస్ ఏరియాల్లో ఈ పాట దూసుకుపోతుందని చెప్పొచ్చు.. ఇక ఈ చిత్రం ఏప్రిల్ 25న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది.

Payal Rajput’s special song..
- Advertisement -