ఆర్డీఎక్స్‌ లవ్‌.. హార్ట్ టచ్చింగ్ మూవీ : పాయల్

467
payal

ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో సెన్సేషనల్ హీరోయిన్‌గా మారిన బ్యూటీ పాయల్ రాజ్ పుత్. తాజాగా హుషారు ఫేమ్ తేజస్ కంచెర్లతో ‘ఆర్ డి ఎక్స్ లవ్’ అంటూ ప్రేక్షకుల ముందుకురాబోతుంది. ఇటీవలె టీజర్‌ని విడుదల చేసి సినిమాపై హైప్ క్రియేట్ చేసిన చిత్రయూనిట్ తాజాగా ట్రైలర్‌ని రిలీజ్ చేసింది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చిత్రయూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

ఆర్డీఎక్స్‌ లవ్‌…..వెరీ హార్ట్ టచ్చింగ్ మూవీ. ఇంత మంచి మూవీలో నటించే ఛాన్స్ ఇచ్చిన కళ్యాణ్ , భానుకి థ్యాంక్స్‌ చెప్పారు హీరోయిన్‌ పాయల్ రాజ్‌పుత్‌. ఆర్ ఎక్స్ 100 చిత్రంతో ఒక్కసారిగా నా లైఫ్ మారిపోయిందని తెలిపారు. ఆర్డీఎక్స్ లవ్ చిత్రం కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఎడ్యుకేషన్ పరంగా ఆలోచింప చేస్తూ.. ఇన్స్పిరేషన్ గా ఈ చిత్రం నిలుస్తుందన్నారు.

పాయల్ బాగా కోపరేట్ చేసి ఈ సినిమాలో నటించింది. డైరెక్టర్ శంకర్ భాను చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. వినాయక్ గారు మా ట్రైలర్ లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉందన్నారు తేజస్‌. నా మీద నమ్మకంతో ఈ చిత్రంలో నటించే ఛాన్స్ ఇచ్చిన కళ్యాణ్ కి నా కృతజ్ఞతలు. టీమ్ వర్క్ తో సినిమాని అందరం కష్టపడి చేశాం. ..ట్రైలర్ చూస్తే సినిమా కంటెంట్ తెలుస్తుందన్నారు.