ఆర్‌ఎక్స్ 100 బ్యూటీ..ఆర్డీఎక్స్‌ పేల్చేసింది

475
payal rajput

ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్లో భారీ క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. తొలి సినిమానే అయినా ఘూటు అందాలతో కుర్రకారులో క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా తర్వాత ప్రస్తుతం వెంకీమామ,డిస్కో రాజా చేస్తున్న పాయల్‌ దీంతో పాటు ఆర్డీఎక్స్‌ లవ్‌ అంటూ ముందుకువస్తోంది.

ఇక ఈ సినిమాలో అందాల ఆరబోతకు మరింత పదునుపెట్టిన పాయల్..స్టిల్స్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా సినిమా టీజర్‌ని అనౌన్స్‌ చేస్తూ విడుదల చేసిన పాయల్ లుక్ కుర్రకారు మతిపొగొట్టోంది. చేతిలో పూలు…అందాల ప్రదర్శనతో హీట్ పెంచేయగా… ఆర్డిఎక్స్ టైటిల్ కు పర్ఫెక్ట్ యాప్ట్ అనేలా ఫ్యాన్స్‌కు నిద్రలేకుండా చేసింది పాయల్.

ఆర్ఎక్స్ 100 కంటే ఘాటు అందాల ఆరబోతతో ఇరగదీశారని నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. తేజస్‌ కంచెర్ల, పాయల్‌ రాజ్‌పుత్‌ నటిస్తున్న ఈ చిత్రానికి శంకర్‌ భాను దర్శకత్వం వహించగా సి.కల్యాణ్‌ నిర్మించారు. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్‌ కానుంది.