డిస్కో రాజాతో పాయల్ సెల్ఫీ..

365
- Advertisement -

టాలీవుడ్‌ మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ‘డిస్కో రాజా’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో డైరెక్షన్‌లో సైఫై టచ్ ఉండే ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. మార్చ్ లో ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటికీ తర్వాత కొద్ది రోజులు ఆగింది.. కానీ ఇప్పుడు షూటింగ్ బ్రేకుల్లేకుండా సాగుతోందట. అయితే తాజాగా ఆర్ఎక్స్ 100 భామ పాయ‌ల్ రాజ్‌పుత్‌ చిత్ర టీంతో క‌లిసింది. ఈ సందర్భంగా రవితేజతో సెల్ఫీలు కూడా తీసుకుంది. ఈ ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేసింది.

disco raja

ఎస్.ఆర్.టి. ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మితమ‌వుతున్న ఈ చిత్రంలో RX 100 ఫేమ్ పాయల్ రాజ్‌పుత్, ‘నన్ను దోచుకుందువటే’ ఫేమ్ నభా నటేష్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో సునీల్, రామ్‌కీ, బాబీ సింహా, వెన్నెల కిషోర్ త‌దితరులు కీల‌క పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్.ఎస్.తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.

- Advertisement -