ప్రభాస్‌పై కన్నేసిన పాయల్‌..!

235

మొదటి సినిమా ‘RX100’ తోనే హిట్ సాధించిన భామ పాయల్ రాజ్ పుత్. ఆ సినిమాలో తెగ బోల్డ్ గా నటించి ప్రేక్షకుల దృష్టినే కాకుండా ఫిలింమేకర్ల దృష్టిని కూడా ఆకర్షించింది. పాయల్ త్వరలో ‘RDX లవ్’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమా ట్రైలర్ రీసెంట్‌గా రిలీజై అందరినీ ఆకర్షించింది. హాట్ సీన్లు.. బోల్డ్ డైలాగ్స్ ఉండే ఫిమేల్ ఓరియెంటెడ్ స్టొరీలా కనిపిస్తోంది. సినిమా టైటిల్‌కు తగ్గట్టు పాయల్ పాత్ర RDX లాగానే ఉంది. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Prabhas

ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో RDX లవ్ బ్యూటీ పాయల్‌ పాల్గొంది. ‘ప్రభాస్ .. విజయ్ దేవరకొండలలో మీకు ఎవరు ఎక్కువ హాట్‌గా అనిపిస్తారు? ఎవరితో కలిసి నటించాలని వుంది?’ అనే ప్రశ్న ఎదురైంది. అందుకు పాయల్ స్పందిస్తూ.. “నాకు ప్రభాస్ అంటే ఎక్కువ ఇష్టం.. ఆయనలో ఏదో స్పార్క్ వుంది. ఆయన బాడీ లాంగ్వేజ్.. సహజంగా అనిపించే స్టైల్ అంటే నాకు మరింత ఇష్టం. ఆయనతో కలిసి నటించాలని వుంది’ అని చెప్పింది. ఇక ఈ అమ్మడు RDX లవ్‌ చిత్రంతో పాటు ‘వెంకీమామ’.. ‘డిస్కోరాజా’ సినిమాల కూడా చేస్తోంది.