క‌రోనా వైర‌స్..’వ‌కీల్ సాబ్’ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్

68
vakeel sab

పవ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ చాలా గ్యాప్ త‌ర్వాత‌ సినిమాల్లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ లో భారీ విజ‌యం సాధించిన పింక్ మూవీ రిమేక్ లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్నారు. ఈ మూవీకి తెలుగులో వ‌కీల్ సాబ్ అనే టైటిల్ ను ఖ‌రారు చేశారు. ఇటివ‌లే ఈమూవీ ఫస్ట్ లుక్ ను కూడా విడుద‌ల చేశారు చిత్ర‌యూనిట్. దిల్ రాజు బోనిక‌పూర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే ఈమూవీ షూటింగ్ 80శాతం వ‌ర‌కు పూర్తి చేసుకుంది .

క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో షూటింగ్ లు బంద్ చేయ‌డంతో ఈమూవీ విడుద‌ల ఆల‌స్యం కానుంది. లాక్ డౌన్ నేప‌ధ్యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌కీల్ సాబ్ డ‌బ్బింగ్ చెబుతున్న‌ట్లు స‌మ‌చారం. ఈ సినిమాను మే 15న విడుద‌ల చేస్తామని ఇప్పటికే ఆ సినిమా బృందం ప్రకటించింది. వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈచిత్రంలో నివేధా ధామ‌స్, అంజ‌లీలు కీల‌క పాత్ర‌ల్లో న‌టించ‌నున్నారు.