పవన్ కళ్యాణ్ 26 మూవీ ఫస్ట్ లుక్ తేదీ ఖరారు

424
pawan
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో భారీ విజయం సాధించిన పింక్ మూవీని తెలుగులో రిమేక్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈచిత్రానికి ఎంసీఎ మూవీ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఈమూవీ షూటింగ్ పాల్గోంటున్నారు. తాజాగా ఉన్న సమాచారం మేరకు ఇప్పటికే 50శాతం చిత్రకరణ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తోందని సమాచారం. ప్రకాష్ రాజ్ ఓ కీలక రోల్ చేస్తున్నారు.

ఈ చిత్రాన్ని మే 15న సమ్మర్ కానుకగా రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తుంది. ఈమూవీ ఎప్పుడు వస్తుందా అని మెగా అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈమూవీ గురించి మరో అప్ డేట్ ఇచ్చారు సంగీత దర్శకుడు తమన్. మార్చి 2న పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ ను , మార్చి న మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఫస్ట్ సింగిల్ ను విడుదల చేయనున్నారని టాక్. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా చేస్తుండటంతో పెద్ద ఎత్తున అంచనాలు నెలకొన్నాయి.

- Advertisement -