చిరుతో పవన్ సెల్ఫీ…

586
chiru pawan
- Advertisement -

తానా మహాసభల తర్వాత భారత్‌కు తిరిగొచ్చిన జనసేనాని పవన్ కల్యాణ్ …అన్నయ్య మెగాస్టార్ చిరంజీవితో భేటీ అయ్యారు. జనసేన ముఖ్యనేత నాదెండ్ల మనోహర్‌తో కలిసి పవన్‌..చిరుతో సమావేశం కాగా ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు నాదెండ్ల.

పవన్ కళ్యాణ్ , తాను సైరా నరసింహారెడ్డి (చిరంజీవి )తో సమావేశమయ్యాం. చాలా విష‌యాలు చర్చించుకున్నాం. ఆయ‌న జీవిత ప్రయాణం మాకెంతో స్ఫూర్తి క‌లిగించిందని ట్విట్ చేశారు. చిరుకు గొప్ప విజ‌యం ద‌క్కాలి…ఆయ‌న‌తో ఇలాంటి స‌మావేశాలు మ‌రెన్నో జరగాల‌ని ఆశిస్తున్నాను అంటూ చిరు-పవన్‌తో కలిసి దిగిన సెల్ఫీని పోస్ట్ చేశారు నాదెండ్ల.

చిరంజీవి ప్రస్తుతం ‘సైరా’ పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 2వ తేదీన సినిమా విడుదల ఉండటంతో చిరంజీవితో సహా చిత్ర యూనిట్ మొత్తం గ్యాప్ లేకుండా పనిచేస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెగాపవర్ స్టార్ రాంచరణ్‌ ఈ మూవీని నిర్మిస్తున్నారు.

nadendla

- Advertisement -