వీళ్ళకంటే..బన్నిపెద్ద తోపు..!

452
pawan kalyan forbes 100: Mahesh, Pawan & Allu Arjun in top 100 list ...
- Advertisement -

సూపర్‌ స్టార్‌ …అని పిలిపించుకునే హీరోలు మన టాలీవుడ్‌ లో ఎంతమంది ఉన్నారు? సూపర్ స్టార్‌ అంటే..హీరోలకుండే బిరుదులు కాదండోయ్‌…ఇక్కడ బిజినెస్‌ ఇంపార్టెంట్‌.! అవును ఇప్పుడు బిజినెస్ పెంచుకునే హీరోల్నే సూపర్ స్టార్లు అంటున్నారు. సినిమా ప్లాప్‌ అయినా..కలెక్షన్లలో తోప్‌గా నిలవాలి.

డివైడ్ టాక్‌ ఉన్నా..దుమ్ములేచిపోమే బిజినెస్‌ జరగాలి. అప్పుడే తమ సినిమా కలెక్షన్లలో కింగ్‌ గా మారిపోవచ్చు. అందుకే టాక్ ఎలా ఉన్నా కలెక్షన్ల మోత మోగిస్తూ.. ఒక సినిమా ఫ్లాప్ అయినా ఆ ప్రభావం ఏమీ కనిపించకుండా తర్వాతి సినిమాకు బిజినెస్ పెంచుకునే హీరోల్నే సూపర్ స్టార్లు అంటారు.

 pawan kalyan forbes 100: Mahesh, Pawan & Allu Arjun in top 100 list ...

తెలుగులో ఇప్పుడున్న స్టార్ హీరోల్లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఇన్నాళ్లూ ఈ తరహా ఇమేజ్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఐతే ఇప్పుడు వీళ్లను మించిన తోపు ఒకడొచ్చాడంటున్నారు సినీ లవర్స్‌. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను ఉద్దేశించే అతడి ఫ్యాన్స్‌ ఈ మాట అంటున్నారని తెలుస్తోంది. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు.

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు తమ సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా సినిమా సినిమాకూ బిజినెస్ పెంచుకుంటున్నారు. వాళ్ల పారితోషకాలు పెరుగుతున్నాయి. మార్కెట్ విస్తరిస్తోంది. వీళ్ల సినిమాలకు ఓపెనింగ్స్ అదిరిపోయేలా వస్తున్నాయి. కానీ పవన్ సినిమాకైనా, మహేష్ మూవీకైనా టాక్ నెగెటివ్‌గా ఉంటే మాత్రం సినిమాలు ఎన్నో రోజులు నిలవట్లేదు. బయ్యర్లు నిలువునా మునిగిపోతున్నారు.

 pawan kalyan forbes 100: Mahesh, Pawan & Allu Arjun in top 100 list ...

పవన్ గత రెండు సినిమాలు సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడులది అదే పరిస్థితి. వీకెండ్ అయ్యాక అవి నిలవలేదు. ఆ సినిమాలు బయ్యర్లను దారుణంగా దెబ్బ కొట్టాయి. ఇక నెగెటివ్ టాక్ తెచ్చుకున్న మహేష్ సినిమాలు 1 నేనొక్కడినే, ఆగడు, బ్రహ్మోత్సవంల పరిస్థితేంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు.

కానీ ఇక్కడ బన్నీ సినిమాల గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే. గత ఏడాది వచ్చిన ‘సరైనోడు’కు, అంతకుముందు ఏడాది రిలీజైన ‘సన్నాఫ్ సత్యమూర్తి’కి గొప్ప టాక్ ఏమీ రాలేదు. అయినా అవి అంచనాల్ని మించి వసూళ్లు రాబట్టాయి. తాజాగా ‘దువ్వాడ జగన్నాథం’కు ఎంతగా డివైడ్ టాక్ వచ్చిందో అందరికీ తెలిసిందే.

 pawan kalyan forbes 100: Mahesh, Pawan & Allu Arjun in top 100 list ...

అయినప్పటికీ వసూళ్లకు ఢోకా లేదు. పవన్, మహేష్‌ల మాదిరే సినిమా సినిమాకూ రేంజి పెంచుకుంటూ, మార్కెట్ విస్తరించుకుంటూ వెళ్లడమే కాదు.. డివైడ్ టాక్‌ను తట్టుకుని కూడా భారీ వసూళ్లు రాబట్టడం ద్వారా ఆ సూపర్ స్టార్లను మించిన తోపు అనిపించుకుంటున్నాడు బన్నీ.

 pawan kalyan forbes 100: Mahesh, Pawan & Allu Arjun in top 100 list ...

మొత్తానికి ‘చెప్పను బ్రదర్’ డైలాగ్‌ నుంచి…’పబ్బుల్లో వాయించే డీజే కాదు..పగిలిపోయేలా వాయించే డీజే’ డైలాగ్ వరకు ఫుల్‌ ఫోకస్ అంతా తన మీదే ఉండేలా ట్రై చేసిన బన్నీ, పవన్‌, ప్రిన్స్‌ ల కంటే కలెక్షన్లలో తోపుగానే నిలబడ్డాడు. మొత్తానికి ‘డీజే’ ఎంత డివైడ్ టాక్‌ తెచ్చుకున్నా…బన్నీ మాత్రం సక్సెస్‌ అయ్యాడనే చెప్పాలి బ్రదర్..!

- Advertisement -