బిగ్ బాస్ 3లో పవన్ కళ్యాణ్ మాజీ భార్య….క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్

147
Renudeshai Bigboss3

మరొకొద్ది రోజుల్లో బిగ్ బాస్ 3 షో ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. అయితే ఈషోలో పాల్గోనబోయే కొంతమంది పార్టిసిపెంట్స్ పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈసారి హోస్ట్ గా నాగార్జున పేరు ఖరారు అయినట్లు తెలుస్తుంది. ఈషోలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పాల్గోంటుందని మొదటి నుంచి ప్రచారం జరుగుతుంది.

అయితే తాజాగా ఈప్రచారంపై స్పందించారు రేణు దేశాయ్. బిగ్ బాస్ 3 విషయంపై నాకు చాలా మంది ఫోన్లు చేసి అడుగుతున్నారు. వారందరికి నేను ఒకటే చెబుతున్నా..నేను బిగ్ బాస్ షో లో కంటెస్ట్ చేయడం లేదని..సోషల్ మీడియాలో జరిగేది అంతా తప్పుడు ప్రచారం అని చెప్పారు. అయితే తనకు బిగ్ బాస్ షో అంటే ఇష్టం అని..షో లో పార్టిసిపెంట్ గా వెళ్లడం కంటే హోస్ట్ గా వెళ్లడం చాలా ఇష్టం అని చెప్పింది.

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి తెరదించారు రేణు దేశాయ్. కాగా బిగ్ బాస్ 3 షో ఆగస్ట్ లో లేదా జులై చివరి వారంలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. గతంలో లాగా లీక్ లు కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు.