రీ ఎంట్రీ ఇవ్వనున్న రేణు దేశాయ్..

431
Renu-Desai
- Advertisement -

తెలుగు చిత్ర పరిశ్రమలో పవన్ కల్యాణ్ ‘బద్రి’ సినిమాతో రంగ ప్రవేశం చేశారు రేణు దేశాయి. ఇదే క్రమంలో పవన్, రేణు దేశాయ్ ప్రేమించుకోవడంతో ఆమె కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉన్నారు. తరువాత పవన్ తోనే ‘జానీ’ సినిమాలో నటించారు. ఇక పవన్ నుంచి విడిపోయిన తరువాత రేణు పూర్తిగా సినిమాలకు దూరంగా ఉండి.. పిల్లల ఆలనా పాలనపై దృష్టిపెట్టారు. అయితే సినిమాలలో నటించకున్నా.. నిర్మాతగా.. ఓ టీవీ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా చేశారు.

Renu Desai Badri

తాజాగా ఆమె సినిమాలలోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఫిలింనగర్ ఈ వార్త చక్కర్లు కొడుతోంది. మరో వ్యక్తితో ఇటీవలె ఆమెకు నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెళ్లి పూర్తి అయిన తరువాత మళ్లీ నటించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మళ్లీ సినిమాలలోకి రావడానికి.. ఆమెకి నటనపై ఉన్న ఆసక్తే కారణం అని చెప్పుకుంటున్నారు. ఆమె రీ ఎంట్రీ ఇవ్వనున్నారా..? లేదా తెలియాలంటే ఆమె స్పందించే వరకు వేచి చూడాల్సిందే. అదే నిజమైతే మరోసారి వెండితెరపై ఆమెను చూసే అవకాశం ప్రేక్షకులకు కలుగుతుంది.

- Advertisement -