నితిన్‌ మూవీ…ప్రీరిలీజ్‌కు జనసేనాని

249
Pawan for Chal mohan Ranga pre release
- Advertisement -

యంగ్‌ హీరో నితిన్,లై బ్యూటీ మేఘా ఆకాష్ జంటగా నటిస్తున్న చిత్రం ఛల్ మోహన్‌ రంగ. త్రివిక్రమ్ శ్రీనివాస్,పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. ఏప్రిల్ 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా ఈ నెల 25న ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లుచేశారు.

హైదరాబాద్‌లో జరిగే ఈ ప్రీ రిలీజ్ వేడుకకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా రానున్నారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన నితిన్‌…చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది…ప్రీ రిలీజ్ వేడుకకు పవన్ కల్యాణ్ వస్తున్నారని తెలిపారు. ఈ చిత్రానికి ఎన్. నటరాజన్ సుబ్రహ్మణ్యన్ సినీమాటోగ్రఫీ అందిస్తున్నారు. లై సినిమాలో నితిన్-మేఘా ఆకాష్ జోడికి ప్రేక్షకులు బ్రహ్మారథం పట్టగా మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ అవతుండటంతో అంచనాలు పెరిగిపోయాయి.

చిత్రం లోని ఇతర ప్రధాన తారాగణం: డా.కె.వి.నరేష్, లిజి,రోహిణి హట్టంగడి, రావురమేష్,సంజయ్ స్వరూప్, ప్రభాస్ శ్రీను, నర్రాశ్రీను, మధునందన్, ప్రగతి, సత్య, పమ్మి సాయి, రాజశ్రీ నాయర్, ఆశు రెడ్డి, వెన్నెల రామారావు, కిరీటి, రణధీర్, నీలిమ భవాని, బేబి హాసిని, బేబి కృతిక, మాస్టర్ జాయ్, మాస్టర్ లిఖిత్, మాస్టర్ స్నేహిత్, మాస్టర్ స్కందన్.

- Advertisement -