అంబులెన్స్ డోర్లు తెరచుకోక వ్యక్తి మృతి

352
Ambulance
- Advertisement -

హైదరాబాద్ మలక్ పేటలో దారుణం చోటు చేసుకుంది. ఎంతో మంది ప్రాణాలు కాపాడే అంబులెన్స్ లోని కొన్ని లోపాల వల్ల ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పొయాడు. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ హైటెక్ సిటీలో లోకల్ ట్రైన్ లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి గుండెపోటు వచ్చింది. అతను ఒక్కసారిగా కింద పడిపోవడంతో అతన్ని ట్రైన్ నుంచి కిందకు దించి అంబులెన్స్ కి సమాచారం అందించారు.

దీంతో కాసేపటి తర్వాత అక్కడికి చేరుకున్న అంబులెన్స్ లో అతడిని ఎక్కించారు. అక్కడి వరకు అంతా బానే ఉంది కానీ.. తీరా ఆసుపత్రికి వెళ్లాక అక్కడ వింత సంఘటన చోటుచేసుకుంది. గుండెపోటు వచ్చిన వ్యక్తిని బయటకు తీద్దామని ప్రయత్నించగా అంబులెన్స్ డోర్లు ఓపెన్ కావడం లేదు. దీంతో ఆసుపత్రి సిబ్బంది కూడా చాలా సేపు డోర్లు తీయడానికి ప్రయత్నించారు. కొద్ది సేపు ప్రాణాలతో ఉన్న ఆ వ్యక్తి చాలా సేపు పోరాడి మృతి చెందాడు.

- Advertisement -