కేటీఆర్…విశ్వవిజ్ఞానఖని

278
- Advertisement -

జీఈఎస్ సదస్సులో భాగంగా రెండో రోజు మంత్రి కేటీఆర్‌ తనదైన శైలీలో అందరిని ఆకట్టుకున్నారు.రెండోరోజు ప్లీనరీకి మాడరేటర్‌గా వ్యవహరించిన కేటీఆర్  తాను చెప్పాల్సిన అంశాలను తణుకు..బెణుకు లేకుండా సూటిగా చెప్పేశారు. మోడరేటర్‌ విధులను నిర్వహించడం తొలిసారి అని చెబుతునే ఎక్కడగా తొలిసారిగా మోడరేటర్ విధులు నిర్వహిస్తున్న ఫిలింగ్ రానివ్వలేదు.  కేటీఆర్ ప్రసంగంతో మీటింగ్ హాల్ మొత్తం కరతాళ ధ్వనులతో మార్మోగిపోయింది.జీఈఎస్‌ వేదికపై ఆయన ప్రసంగం మంత్రముగ్ధుల్ని చేసిందని పలువురు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Paruchuri Gopala Krishna praises KTR
తాజాగా సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ  ట్విట్టర్‌లో కేటీఆర్‌ను ప్రశంసించారు. ‘ కేటీఆర్‌గారు, ఇన్నాళ్లూ రాజకీయ పోరాట యోధునిగా, యువ నాయకుడిగా తెలిసిన మీరు, నిన్న ప్రపంచ వ్యాపారసదస్సు (జీఈఎస్‌)లో విశ్వవిజ్ఞానఖనిలా కనిపించారు! అభినందనలండి! మీ భాషణం అనితరసాధ్యం’అని ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ను రీట్వీట్‌ చేస్తూ కేటీఆర్‌ థ్యాంక్స్‌ చెప్పారు.  హీరో రామ్ సైతం కేటీఆర్ స్పీచ్‌పై ప్రశంసలు గుప్పించారు. కేటీఆర్ స్పీచ్‌ అందరిని ఇంప్రెస్ చేసిందని కొనియాడారు.

 Paruchuri praises KTR

Paruchuri praises KTR

- Advertisement -