త్వరలో ప్రతి రైతుకు రైతు బంధు ఇస్తాం..

249
palla rajeshwar reddy
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం రంగంలో మార్పు కోసం చేస్తున్న ప్రతి పని రైతులకు వివరంగా తెలవాలి,దాని కోసమే ఈ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని రాష్ట్ర రైతు బంధు ఛైర్మెన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. నేడు మాహబూబాబాద్ జిల్లాలో నియంత్రిత సాగు విధానం-లాభసాటి వ్యవసాయంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడారు.

కరోన విజృంభిస్తున్న వేళా రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని కొనే నాధుడే లేకుంటే రైతుల పట్ల దేవుడిలా వచ్చి 30 వేళా కోట్లతో ధాన్యాన్ని గ్రామాల్లోనే కొనుగోలు చేస్తున్న గొప్ప సీఎం కేసీఆర్ అని అన్నారు. తమిళనాడులో 900 కె మొక్క జొన్న కొంటున్నారు,అదే తెలంగాణలో 1760 రూపాయలతో అదే మొక్కజొన్నను కొనుగోలు చేస్తున్నారు అంటే కేవలం రైతు నష్టపోవొద్దు అని సీఎం కేసీఆర్ ఇలా కొనుగొలు చేస్తున్నాడు. మోటార్లు కాలిపోతే ఒకప్పుడు కావడి కట్టి పట్టణానికి మోటార్లు మోసుకపోయిన రైతులు నేటి సీఎం పాలనలో అలా కనపడటం లేదు.

త్వరలో రైతు బంధు ప్రతి రైతుకు ఇస్తాం. ఇప్పటికే నిధులను ఆర్ధిక శాఖ నుండి వ్యవసాయ శాఖకు మళ్లించడం జరిగింది. ఈ వానాకాలం నుండి రైతు బంధు రాలేదు అనే మాట ఒక్క రైతు నోటా వినవద్దు అని అధికారులను సీఎం కేసీఆర్ ఎప్పుడో ఆదేశించారు. 2014 -15లో 60 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి ఉంటే 2019-20 లో 1 కోటి మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి పెరిగింది.దీనికి కారణం సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగంలో తెచ్చిన సంస్కరణలే అని పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -