పలాస 1978… లిరికల్ సాంగ్

580
palasa 1978
- Advertisement -

రియలిస్టిక్ కథలకు టైం పీరియడ్ కూడా తోడైతే ఆ కథలు విపరీతంగా ఆకట్టుకుంటాయి. అలాంటి కొన్ని ఆసక్తికరమైన అంశాల చుట్టూ అల్లుకున్న కథాంశంతో వస్తోన్న చిత్రం ‘పలాస 1978’. 1978 ప్రాంతంలో పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో అల్లుకున్న కథ ఇది. ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన వచ్చింది. చిత్ర కథాంశం గురించి తెలిసిన చాలామంది ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇక రఘు కుంచే సంగీతం అందిస్తోన్న ఈ చిత్రం నుంచి ఓ పాటను విడుదల చేశారు. లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లేటెస్ట్ సెన్సేషన్ పల్లెకోయి బేబీ కలిసి ఈ పాటను పాడటం విశేషం. బాలు ఓ ముప్ఫైయేళ్లు వెనక్కి వెళ్లి తన గాత్రాన్ని వినిపిస్తే బేబీ గాత్రం పాటకు ఓ ఫ్రెష్ నెస్ ను తీసుకువచ్చింది.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి పాడాలనుకోవడం ఎవరికైనా ఓ కల. ఆ కలను గాయనిగా కెరీర్ ఆరంభించిన తొలినాళ్లలోనే అందుకున్న పల్లెకోయిల బేబీ ఏకంగా ఆయనతో కలిసి డ్యూయొట్ ఆలపించేయడం నిజంగా విశేషమే. అంత పెద్ద లెజెండ్ తో పాడుతున్నా.. ఎక్కడా తొణక్కుండా తన సహజమైన గాత్రంతో ఆకట్టుకుంది.లక్ష్మీ భూపాల ఈ పాటను రాశారు.

దర్శకుడు కరుణ కుమార్ కు ఇది తొలి చిత్రం. కానీ ఆయన రచయితగా సాహిత్యలోకంలో అందరికీ తెలిసిన వ్యక్తి. ఆ రకంగా ఇది కథగా ఎంతో బలంగా ఉండబోతోందని కూడా అర్థం చేసుకోవచ్చు. సుధ మీడియా పతాకంపై రూపొందిన ఈ చిత్రంలో రక్షిత్, నక్షత్ర జంటగా నటించారు. రఘు కుంచే తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, శృతి, జగదీష్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

- Advertisement -