రివ్యూః “పలాస 1978”

4033
palasa
- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య చిన్న చిన్న సినిమాలు మంచి విజయాలను సాధిస్తున్నాయి. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి ఎక్కువ కలెక్షన్లను రాబడుతున్నాయి. కథను నమ్ముకుని సినిమాలు తీస్తూ తమ సత్తాను చాటుతున్నారు దర్శకులు. రక్షిత్ హీరోగా తెరకెక్కిన చిత్రం పలాస 1978. కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని ధ్యాన్ అట్లూరి నిర్మించారు. రఘు కుంటే సంగీతం అందించగా నక్షత్ర కథానాయికగా నటించింది. ఈరోజు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం.

కథః పలాసలోని ఓ కళాకారుల కుటంబానికి చెందిన అన్నదమ్ములు మోహన్ రావు( రక్షిత్) రంగారావు తిరువీర్ ). వీరిద్దరు ఎలాంటి గోడవలు లేకుండా అన్యోన్యతగా ఉంటారు. అదే ఉర్లో ఉంటున్న మరో ఇద్దరు అన్నదమ్ములు పెద్ద షావుకారు(జనార్థన్), చిన్నషావుకారు గురుమూర్తి(రఘుకుంటె). వీరిద్దరికి ఒకరు అంటే ఒకరికి అస్సలు పడదు. వీళ్ల ఆదిపత్య పోరుకి మోహన్ రావు, రంగారావులు పావులుగా మారిపోతారు. షావుకారు అన్నదమ్ముల మధ్య జరిగిన పోరులో ఈ కళాకారుల కుటుంబం ఎలాంటి ఇబ్బందులు పడింది ? ఆ ఇబ్బందుల నుంచి బయటపడ్డారాలేదా అన్నది సినిమా కథ.
ప్లస్ పాయింట్స్ః
ముఖ్యంగా చెప్పాలంటే ఈసినిమాకు కథ హైలెట్ గా నిలుస్తుంది. పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు. మోహన్ రావు పాత్రలో రక్షిత్ సహజంగా నటించారు. అలానే రంగారావు పాత్రలో తిరువీర్ కూడా అద్భుతంగా నటించి మెప్పించారు. కుల వివక్ష.. అప్పటికీ, ఇప్పటికీ సమాజం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య సినిమాను తెరకెక్కించారు. ముఖ్యంగా రఘుకుంచె నేపధ్య సంగీతం మెచ్చుకునే విధంగా ఉన్నది. అరుల్ ఫొటోగ్రఫీ అక్కడక్కడా మెప్పించింది.
మైనస్ పాయింట్స్ః
కథనం బాగున్నా స్టోరీని లాగదీసినట్లు ఉంటుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం కాస్త మైనస్ గా చెప్పుకోవచ్చు.. యాక్షన్ సీన్లు కొన్ని పెట్టి ఉంటే బాగుండేది.
విశ్లేషణః
కథ బాగుంటే తెలుగు ప్రేక్షకులు చిన్నా సినిమాలను కూడా ఆదరిస్తారు. చివరగా పలాస 1978 సహజత్వానికి దగ్గరగా ఉన్న సినిమా అని చెప్పుకోవచ్చు..

విడుదల తేదీ: 06/03/2020
రేటింగ్: 2.5/5
నటీనటులు: రక్షిత్, నక్షత్ర, రఘు కుంచె, తిరువీర్,తదితరులు
సంగీతం: రఘుకుంచె
నిర్మాత: ధ్యాన్ అట్లూరి
దర్శకత్వం: కరుణ కుమార్

- Advertisement -