నగర సంస్కృతిని ప్రతిబింబించేలా ‘పక్కా హైదరాబాదీ’

542
nvs reddy
- Advertisement -

హైదరాబాద్ భాషా, సంస్కృతి, ఆచార వ్యవహారాలను నగరానికి కొత్తగా వచ్చే వారందరికి తెలియజేసేలా “పక్కా హైదరాబాదీ” పేరిట హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ఒక ఆసక్తికరమైన కార్యక్రమాన్ని త్వరలో చేపట్టనున్నట్లు ఆ సంస్థ మేనేజింగ్ డైరక్టర్ ఎన్.వి.యస్. రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ మేరకు హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా నగరంలో వున్న అనేక దర్శనీయ స్థలాలు, పర్యాటక ఆకర్షణలు, పలు రంగాలలో విశిష్ఠ సేవలందించిన ప్రముఖుల తైలవర్ణ చిత్రాల ప్రదర్శనను మెట్రో స్టేషన్ పరిసరాలలో చేపట్టాలని ప్రతిపాదించినట్లు శ్రీ ఎన్.వి.యస్. రెడ్డి అన్నారు.

అలాగే, జంట నగరాలలో స్థానిక ప్రజల వాడుక భాషలో అధికంగా వినియోగించే “కైకూ, నక్కో, హౌలే, ఐసాయిచ్, ఖైరియత్?, పోరి, పరేషాన్” వంటి పదాల వినియోగం, వాటి అర్థాలను సందర్భాలను ఆసక్తి గల వారందరికి తెలియజేసేలా మెట్రో స్టేషన్ గోడలపై వ్రాయించాలని ప్రతిపాదించినట్లు ఆయన అన్నారు.

అనేక వారసత్వ కట్టడాలతో, 400 సంవత్సరాలు పైబడిన గొప్ప చరిత్రగల హైదరాబాద్ నగర సాంస్కృతిక కళా వైభవాన్ని పలువురికి తెలియజేయ్యాలనే ఉద్దేశ్యంతో హెచ్‌యంఆర్ఎల్ సంస్థ పలు చర్యలు తీసుకుంటోందనిఆయన అన్నారు.

ఈ విషయమై నగర పౌరుల్లో ఆసక్తిగలవారు తమ సలహాలను, సూచనలను “ప్రధాన పౌరసంబంధాల అధికారి, హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ”కు ఈ-మెయిల్ ద్వారా cprohmrl@gmail.com తెలియజేయాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు.

- Advertisement -