పాకిస్థాన్ క్రికెటర్‌తో భారతీయ యువతి పెళ్లి..!

408
- Advertisement -

పాకిస్థాన్‌ క్రికెటర్‌ హసన్ అలీ భారతీయ యువతి షామియా అర్జూను పెళ్లాడాడు. దుబాయ్‌లో నిన్న వీరి వివాహం వైభవంగా జరిగింది. వీరి పెళ్లి ముస్లిం సాంప్ర‌దాయం ప్ర‌కారం జ‌రిగింది. ఇండియాలో పుట్టి పెరిగిన సామియా ఆర్జూ ప్ర‌స్తుతం దుబాయ్‌లో ఉంటోంది. ఫ్లైట్‌ ఇంజినీర్‌గా ప‌నిచేస్తున్న ఆమె కొన్నాళ్ల క్రితం అలీకి ప‌రిచ‌య‌మైంది. ఆ ప‌రిచ‌యం ప్రేమ‌గా మారి.. పెళ్లికి దారితీసింది.

పెళ్లి దుస్తుల్లో వీరిద్ద‌రూ మెరిసిపోయారు. బ్లాక్ షేర్వానీలో హ‌స‌న్‌, రెడ్ అండ్ గోల్డ్ డ్రెస్సులో ఆర్జూ ఆక‌ట్టుకున్నారు. ఇద్ద‌రూ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్‌ను బుర్జ్ ఖ‌లీఫా ముందు జ‌రిపారు. వ‌లీమా కూడా దుబాయ్‌లోనే నిర్వ‌హించ‌నున్నారు.

Pakistani cricketer

అంతేకాదు తన వివాహానికి ఇండియన్ క్రికెటర్లను కూడా హసన్ అలీ ఆహ్వానించాడు. తన పెళ్లికి ఇండియన్ క్రికెటర్లు కూడా వస్తే తనకు మరింత సంతోషంగా ఉంటుందని హసన్‌ తెలిపాడు. అయితే తమ వివాహం గురించి 25 ఏళ్ల హసన్ అలీ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. తన బ్యాచిలర్ జీవితానికి ఇదే చివరి రాత్రి అని ట్వీట్ చేశాడు. ఎడారి మధ్యలో నిర్వహించిన మెహిందీ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను కూడా అప్ లోడ్ చేశాడు.

మరోవైపు, హసన్ అలీకి ఇండియన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపింది. ‘కంగ్రాట్ హసన్ అలీ. మీరిద్దరూ జీవిత కాలం సంతోషంగా, ప్రేమాభిమానాలతో ఉండాలి.’ అని ట్వీట్ చేసింది.

- Advertisement -