పాక్ ఆర్టిస్ట్‌లు ఇండియాలో అంతపని చేశారా…?

409
- Advertisement -

పాకిస్థాన్ నటులు ఫవాద్ ఖాన్, రహాత్ ఫతే అలీ ఖాన్, షఫాకత్ అమానత్ అలీ, మావ్రా హోకేన్, ఇమ్రాన్ అబ్బాస్ నక్వీ తదితరులు తమ ఏజంట్ల ద్వారా ఇండియాలో బ్లాక్ మనీ దందా నిర్వహించినట్టు హిందీ టీవీ చానల్ ‘న్యూస్ 18’ ఇండియా తన స్టింగ్ ఆపరేషన్ ద్వారా వెల్లడించింది. ఈ ఆపరేషన్ లో సంచలన విషయాలు వెలుగుచూశాయి. నవంబర్ 8న దేశంలో పెద్ద నోట్లను రద్దు చేస్తున్నామని ప్రకటించడానికి కొన్ని రోజుల ముందు ఈ స్టింగ్ ఆపరేషన్ సాగడం గమనార్హం.

Pakistani-artists

దాదాపు 15 రోజుల క్రితం న్యూఢిల్లీ, ముంబై ప్రాంతాల్లో ఈ ఆపరేషన్ జరిగిందని న్యూస్ 18 ప్రకటించింది. న్యూస్ 18 కు చెందిన అండర్ కవర్ రిపోర్టర్లు, పాక్ నటీనటుల ఏజంట్లను సంప్రదించి ఆశక్తికర విషయాన్ని రాబట్టారట. పాక్ నటీనటులను పెళ్లిళ్లలో నృత్యాలు చేసేందుకు, సినిమాల్లో నటించేందుకు అడిగారట. దానికి వారి ఏజెంట్లు కొన్ని కండిషన్స్ పెట్టారట. పర్ఫామెన్స్ చేసినందుకు తమ నటులకు ఇక్కడి అకౌంట్‌లోకి కాకుండా,, ఆస్ట్రేలియా, దుబాయ్ తదితర దేశాల్లో ఉన్న బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు జమ చేయాలంటూ కోరారట. మొత్తం కుదిరిన ఒప్పందంలో 25 శాతం డబ్బును మాత్రమే తమకు ఇస్తున్నట్టు అగ్రిమెంట్ లో చూపాలని..మిగిలిన డబ్బును లెక్కలోకి రాకుండా..యూఏఈలోని ఖాతాలో జమ చేయాలని కోరాడట.

Pakistani-artists

నటుడు ఫవాద్ ఖాన్ రెండు గంటల పాటు నృత్యం చేయడానికి రూ. 50 లక్షలు తీసుకుంటాడని అతని మేనేజర్ చెప్పాడు. కానీ ఈ డబ్బు, అటు బ్లాక్, ఇటు వైట్ రూపంలో ఉండాలని కండిషన్ పెట్టాడట. ఇక గాయకుడు షఫాకత్ అమానత్ విషయానికి వస్తే, ఆయన మేనేజర్ చెప్పిన ప్రకారం, రూ. 35 లక్షల నుంచి రూ. 65 లక్షలు ఆయన తీసుకుంటున్నాడు. కానీ వాళ్లు తీసుకునే మొత్తాన్ని తక్కువ చేసి చూపించాలని కండిషన్ పెట్టారట. ఇచ్చిన మొత్తంలో 10 శాతం మాత్రమే వైట్‌ మనిగా చూపించాలని,,మిగతా డబ్బును బ్లాక్ మని రూపంలో ఇవ్వాలన్నారట. ఆధాయ పన్నును తప్పించుకునేందుకు పాక్ నటీనటులు ఇలా చేస్తున్నారట. ఇలా పాక్ నటీనటులంతా తప్పుడు లెక్కలు చూపిస్తూ..రహస్యంగా బ్లాక్ మని వ్యవహారం నడిపిస్తున్నారని న్యూస్ 18 పత్రిక తెలిజేసిందట.

- Advertisement -