కొత్తనోట్లను కాపీ కొట్టలేరు

257
- Advertisement -

భారత ప్రభుత్వం రూ.1000, రూ500ల నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వీటి స్ధానంలో ఈ రోజు నుంచి రూ.2000,రూ.500కొత్త నోట్లను అమలులోకి తెస్తోంది. ఈ కొత్త రూ.2వేలు,రూ.5వందల నోట్లను కాపీ చేయడం సౌధ్యం కాదని ఇంటెలిజెన్స్‌ వర్గాలు తేల్చేశాయి. కొత్త నోట్ల తరహాలో నకిలీ కరెన్సీ నోట్టను ముద్రించడం సులభమైన పని కాదని ఇంటెలిజెన్స్‌ అధికారులు స్పష్టం చేశారు.

Pakistan won't be able to copy new notes

దీని ద్వారా దొంగ నోట్లను ప్రింట్‌ చేసే దుండగులకు ఆటకట్టినట్టేనని అధికారులు వెల్లడించారు. అలాగే పాకిస్థాన్, అది ప్రేరేపిస్తున్న ఉగ్రవాద సంస్థలు ఈ నోట్లకు నకిలీలు సృష్టించడం అసాధ్యమైన పని అని ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. గూఢచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్(రా), ఇంటెలిజెన్స్ బ్యూరో, డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ)లు కొత్తనోట్లను పరిశీలించిన అనంతరం నకిలీ నోట్లను ముద్రించడం అంత సులభం కాదని తేల్చేసింది.

భారత డుప్లికేట్ కరెన్సీని ప్రింట్ చేసేందుకు పెషావర్‌లో పాకిస్థాన్ ఒక నోట్ల తయారీ కేంద్రంను ఏర్పాటు చేసుకుందని భారత ఇంటెలిజెన్స్ సంస్థలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిన విషయం తెలిసిందే. వీటిలో ఎక్కువగా రూ.1000, రూ.500 ఉన్నాయని తెలిపారు. నకిలీ కరెన్సీని పాక్ గూడఛార సంస్థ అయిన ఐఎస్ఐ.. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, లష్కరే తాయిబా, ఇతర ఉగ్రవాద సంస్థలకు అందిస్తుంది. వారి ద్వారా భారతదేశంలోకి వాటిని రప్పించేందుకు ప్రయత్నిస్తోంది. తద్వారా భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని పాకిస్తాన్ కుట్ర పన్నుతోంది. అందుకే మోడీ పెద్ద నోట్ల రద్దు ద్వారా చెక్ పెట్టారు.

Pakistan won't be able to copy new notes

తర్వలోనే కొత్త వేయ్యిరూపాయల నోట్లను విడుదల చేయనున్నట్లు ఆర్ధికశాఖ కార్యదర్శి శక్తికాంత్‌దాస్‌ ఈరోజు తెలిపారు. కొత్త కలర్‌ కాంబినేషన్‌,డిజైన్‌తో రూ.1000నోట్ల మరికొన్ని నెలల్లోనే మార్కెట్లోకి వస్తాయన్ని ఆయన అన్నారు. కొత్త నోట్ల డిజైన్‌కు సంబంధించిన ప్రక్రియ గత రెండు మూడు నెలలుగా సాగుతోందని, ఆర్‌బీఐకి చెందిన కేవలం ముగ్గురు అధికారులు మాత్రమే ఆ ప్రక్రియలో నిమగ్నమైనట్లు శక్తికాంత్‌దాస్‌ తెలిపారు.

- Advertisement -