ఫోర్బ్స్‌ టాప్‌ 15లో పీవీ సింధు…

265
pv sindhu forbes

భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన తెలుగు ఏస్ షెట్లర్‌ పీవీ సింధు మరో అరుదైన ఘనత సొంతం చేసుకుంది. తన ఆటతీరుతోనే కాదు సంపాదనలోనూ తక్కువేం కాదని నిరూపించుకుంది. ఫోర్భ్స్ 2019 విడుదల చేసిన టాప్ 15 జాబితాలో చోటు దక్కించుకుంది.

అమెరికాకు చెందిన టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్‌ రూ. 207 కోట్లతో టాప్‌లో నిలవగా పివి సింధు 13వ స్ధానంలో నిలిచింది. ఈ జాబితా ప్రకారం సింధు ఆదాయం ఏడాదికి రూ. 39 కోట్లు. ప్రైజ్‌మనీ కింద రూ. 3. 50 కోట్లు అందుకున్న సింధు.. ఎండార్స్‌మెంట్ల నుంచి ఏకంగా రూ. 35.50 కోట్లు ఆర్జించింది. ఈ జాబితాలో చోటు సంపాదించిన ఏకైక మహిళా అథ్లెట్‌గా నిలిచింది సింధు.

గతేడాది జూన్‌ నుంచి ఈ ఏడాది జూన్‌ వరకు సదరు అథ్లెట్ల టోర్నీ ప్రైజ్‌మనీ, ఎండార్స్‌మెంట్ల ద్వారా లభించిన మొత్తం ఆదాయం ఆధారంగా ఈ జాబితాను రూపొందించింది ఫోర్బ్స్.