విమానంలో ఒకే ఒక్కడు..

247
plane

అదేంటి విమానంలో ఒక్కడే ప్రయాణించడం ఏంటనుకుంటున్నారా..?అవును మీరు చదివేది నిజం..న్యూయార్క్‌లో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొలరాడోలోని ఆస్సెన్‌ నుంచి సాల్ట్ లేక్ సిటీకి వెళ్లేందుకు డెల్టా విమానంలో టికెట్ బుక్ చేసుకున్నారు ప్రముఖ రచయిత,విన్సెంట్ పియోన్‌.

విమానాశ్రయంలోకి వెళ్లగానే బోర్డింగ్‌ వద్ద సిబ్బంది ఈ విమానంలో ప్రయాణించే వ్యక్తి మీరు ఒక్కరే అని చెప్పడంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. ఒక్కడినే ప్రయాణించబోతున్నానని తెలిసి తన ఒంటరి ప్రయాణాన్ని వీడియో తీసి ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

సిబ్బంది నన్ను విమానం వద్దకు తీసుకెళ్తుంటే గతంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడైనా చూశారా అని వారిని అడిగానని చెప్పారు. గతంలో కొన్ని సందర్భాల్లో జరిగాయని సమాధానమిచ్చారు. ఒక్కడినే అయినా నాకు ఘన స్వాగతం లభించిందని… ఇవన్నీ చూసి గొప్ప అనుభూతికి లోనయ్యా అని వివరించాడు. అయితే తానొక్కడినే ప్రయాణికుడిని కావడంతో కార్గో సిబ్బంది విమానంలో బరువు ఉండటానికి ఇసుక సంచులు వేయడం గమనించానని చెప్పారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.