జగన్ రాజకీయ వారసుడు ఏవరో తెలుసా?

255
Jagan

ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఓ వ్యక్తి పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకి ఎవరా వ్యక్తి అనుకుంటున్నారా? ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయ వారసుడు రాజారెడ్డి. అదేంటి జగన్ తాత రాజారెడ్డి మరణించాడు కదా మళ్లీ జగన్ వారసుడు ఏంటీ అనుకుంటున్నారా? ఇంతకీ రాజారెడ్డి ఎవరు అంటే జగన్ సోదరి షర్మీల అనిల్ దంపతుల కుమారుడు రాజారెడడ్డి. తన తాతకు గుర్తింపుగా కూమారుడికి ఆ పేరు పెట్టుకుంది షర్మీల. ఇప్పుడు రాజారెడ్డి పేరు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ys-jagan

ఇటివలే వైయస్సార్ జయంతి రోజున రాజారెడ్డి హైలెట్ గా నిలిచారు. ప్రార్ధన సమయంలో జగన్ పక్కనే కూర్చోని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆరున్నర అడుగుల ఎత్తుతో మంచి ఫిట్నెస్ తో బాలీవుడ్ హీరోని తలపించేలా కనిపించడంతో అంతా ఆయనపైనే దృష్టి సారించారు. సీఎం వైయస్ జగన్ తన తాత వైయస్ రాజారెడ్డి పోలిక అంటూ ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. ఆయనకు ఉన్న రాజకీయ చతురత, కోపం అన్ని జగన్ లో ఉన్నాయని ఆయన సన్నిహితులు చెప్పేవారు.

వైఎస్ జగన్ కు కుమారులు లేరు అన్న సంగతి తెలిసిందే. దీంతో షర్మీల కుమారుడు రాజారెడ్డి జగన్ రాజకీయా వారసుడు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాజారెడ్డికి రాజకీయాలంటే ఇష్టమని ప్రచారం ఉంది. వైయస్ షర్మిల ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర చేస్తున్నప్పుడు తల్లి అడుగులో అడుగులు వేశాడు. చాలా సార్లు ఆమెతో కలిసి పాదయాత్ర చేశారు.