లోక్‌ సభ స్పీకర్‌గా ఓం బిర్లా..!

191
ls speaker

లోక్ సభ కొత్త స్పీకర్‌గా రాజస్థాన్ బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యే అవకాశం ఉందని సమాచారం. లోక్ సభ స్పీకర్ రేసులో పలువురు బీజేపీ నేతల పేర్లు వినిపించినా చివరకు ఓం బిర్లా వైపు ఎన్డీయే వర్గాలు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. ఎంపీల ప్రమాణస్వీకారం అనంతరం స్పీకర్‌ ఎన్నిక చేపట్టనుండగా బిర్లా ఎన్నిక ఏకగ్రీవం కానుంది.

ఓమ్‌ బిర్లా రాజస్థాన్‌లోని కోట-బుండి లోక్ సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల జరిగిన లోక్‌ సభ ఎన్నికల్లో ఓమ్‌ బిర్లా కాంగ్రెస్‌ అభ్యర్థి రామ్‌ నారాయణ్‌ మీనాపై 2.79 లక్షల మెజార్టీతో గెలుపొందారు. రెండు సార్లు ఎంపీగా మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు.

విద్యార్థి నాయకుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఓమ్‌ బిర్లా.. అంచెలంచెలుగా ఎదిగారు. 1991 నుంచి 12 సంవత్సరాల పాటు భారతీయ జనతా యువ మోర్చాలో కీలక నాయకుడిగా పని చేశారు.బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ స్థాయిలో ఉపాధ్యక్షుడిగా పని చేశారు.