ట్విట్టర్ రివ్యూ: ఓ బేబీ

1112
Oh Baby Review
- Advertisement -

స‌మంత అక్కినేని, ల‌క్ష్మి, నాగ‌శౌర్య‌, రావు ర‌మేష్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్ ప్ర‌ధాన తారాగ‌ణంగా బి.వి.నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం ఓ బేబీ. ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో సమంత.. ‘ఓ బేబీ’ అంటూ సోలోగా ప్రేక్షకుల్ని అలరించేందుకు థియేటర్స్‌లో ఎంటర్ అయ్యింది.

ఓ బేబీ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. డిఫరెంట్స్ కాన్సెప్ట్ మూవీలో సమంత అద్భుత నటన ప్రదర్శించిందంటూ ప్రశంసలు గుప్పిస్తున్నారు నెటిజన్లు. కొంతమంది ఏకంగా నాలుగు స్టార్లు ఇస్తూ సినిమా అద్భుతమని కితాబిస్తున్నారు.

సమంత కెరియర్‌‌లోనే బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చిందని రాక్ స్టార్‌లా సమంత నటనతో మెరిసిందని క్లైమాక్స్ హార్ట్ టచ్చింగ్‌గా ఉందంటున్నారు. మరికొంతమంది ఈవారం బాక్సాఫీస్‌ని ‘ఓ బేబీ’ కుమ్మేయడం ఖాయమే అంటున్నారు.

సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో నాగ శౌర్య,లక్ష్మీ, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించగా సమంత 23 ఏళ్ల యువతిగా 70 ఏళ్ల బామ్మగా డిఫరెంట్ రోల్ ప్లే చేసి సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.

- Advertisement -