వైట్‌హౌజ్‌లో దీపావ‌ళి…

241
- Advertisement -

అమెరికా అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా వైట్‌హౌజ్‌లో దీపావ‌ళి సెలబ్రేష‌న్స్‌లో పాల్గొన్నారు. చ‌రిత్ర‌లో తొలిసారి వైట్‌హౌజ్‌లోని ఓవ‌ల్ ఆఫీస్‌లో ఆయన దీపాన్ని వెలిగించారు. ఈ సాంప్ర‌దాయాన్ని త‌ర్వాత వ‌చ్చే అధ్య‌క్షులు కూడా కొన‌సాగిస్తార‌ని ఒబామా ఆశాభావం వ్య‌క్తంచేశారు. త‌న ద‌గ్గ‌ర ప‌నిచేసే ఇండియ‌న్, అమెరిక‌న్స్‌తో క‌లిసి ఆయ‌న పండ‌గ‌ వేడుకలు జరుపుకున్నారు. 2009లో అధ్య‌క్షుడిగా తొలిసారి వ్య‌క్తిగ‌తంగా దీపావ‌ళి జ‌రుపుకున్న ఒబామా. ఇప్పుడు ఓవ‌ల్ ఆఫీస్‌లో దీపం వెలిగించిన త‌ర్వాత తన మ‌ధురానుభూతుల‌ను ఫేస్‌బుక్‌ ద్వారా పంచుకున్నారు. 2009లో దీపావ‌ళి జ‌రుపుకున్న తొలి అమెరికా అధ్య‌క్షుడిగా నిల‌వ‌డం త‌న‌కు గ‌ర్వంగా ఉంద‌ని,…ఒబామా అన్నారు.

online news portal

ఆ త‌ర్వాత ముంబైలో ఇదే దీపావళి పండుగ సంద‌ర్భంగా భారతీయులు ఆహ్వానించిన తీరును, తమతో వారు చేసిన డ్యాన్స్లను నేను, మిచెల్ ఎప్పటికీ మరచిపోలేనని ఒబామా ఈ సందర్భంగా అన్నారు. చీకటిని వెలుగు ఎలా అధిగమిస్తుందో తెలిపే సంకేతంగా ఈ దీపం నిలుస్తుందన్నారు. ఒబామా కుటుంబం త‌రఫున మీకు దీపావ‌ళి శుభాకాంక్షలు అంటూ వైట్హోస్ ఫేస్బుక్ పేజీలో ఆయన పోస్ట్‌ చేశారు. అమెరికాతోపాటు ప్ర‌పంచ‌వ్యాప్తంగా దీపావళి పండుగ వేడుకలు జరుపుకుంటున్నా వారందరికీ ఒబామా శుభాకాంక్షలు చెప్పారు. హిందూ, జైన్‌, సిక్కులు, బౌద్ధ మ‌త‌స్థులు అంద‌రూ దీపాలు వెలిగించి పండుగ‌ను ఘ‌నంగా జ‌రుపుకున్నారు. ఈ పండుగ‌ చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజ‌యమ‌ని ఒబామా అన్నారు. మ‌నుషుల మ‌ధ్య వివిధ ర‌కాలుగా గూడుక‌ట్టుకున్న విభేదాల‌ను తొల‌గించే పండుగ అని ఆయ‌న తెలిపారు.

online news portal

ఈ మెసేజ్ ఇప్పుడు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. అర్థరాత్రి ఒబామా చేసిన ఈ పోస్టుకు 1.5 లక్షలమంది లైక్ రాగా.. 33వేలకు పైగా సార్లు షేర్ చేశారు. అటు అధ్య‌క్ష బ‌రిలో ఉన్న డెమొక్ర‌టిక్ అభ్య‌ర్థి హిల్ల‌రీ కూడా దీపావ‌ళి శుభాకాంక్ష‌లు తెలిపారు.

- Advertisement -