ఎన్టీఆర్‌…అయినను పోయిరావలె హస్తినకు..!

280
ntr trivikram

ఎన్టీఆర్- త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అరవింద సమేత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ మరోసారి త్రివిక్రమ్‌తో సినిమా చేయనున్నారు. ఆగస్టు నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుండగా తాజాగా ఆసక్తికరవార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.

త్రివిక్రమ్ సెంటిమెంట్ ప్రకారం ఈ సినిమాకు అయినను పోయిరావలె హస్తినకు అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. త్రివిక్రమ్ గత సినిమాలను పరిశీలిస్తే అఆ,అరవింద సమేత,అల వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ హిట్‌లుగా నిలిచాయి.

ఈ నేపథ్యంలోనే అయినను పోయిరావలె హస్తినకు అనే టైటిల్ పెట్టినట్లు చెబుతున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోందని టాక్‌. మొత్తంగా అరవింద సమేతతో ఫ్యాక్షన్‌కు సరికొత్త అర్ధం చెప్పిన త్రివిక్రమ్ ఈ సారి ఎన్టీఆర్‌తో తీయబోయే సినిమా కథ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది.