అరకులోయలో “ఆర్ఆర్ఆర్” షూటింగ్

452
rrr
- Advertisement -

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈమూవీ రామ్ చరణ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ అలీయా భట్ నటించగా ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ హీరోయిన్ ఒలీవియా మోరిస్‌ నటిస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ చాలా వరకు పూర్తి చేసుకుందని సమాచారం. కేవలం పాటలు మాత్రమే మిగిలి ఉన్నాయని తెలుస్తుంది. తాజాగా ఉన్న సమాచారం ప్రకారం ప్రస్తుతం ఈసినిమా క్లైమాక్స్ సీన్స్ ను తెరకెక్కిస్తున్నారు అని తెలుస్తుంది. ఈ క్లైమాక్స్ ను అరకులోయలో చిత్రికరిస్తున్నారు.

ఇందుకోసం హీరో ఎన్టీఆర్ నిన్నలో లొకేషన్ కి చేరుకున్నారు. త్వరలోనే రామ్ చరణ్ కూడా ఈ క్లైమాక్స్ షూటింగ్ పాల్గొననున్నాడు. సంక్రాంతి లోపే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేయాలని ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. అయితే ఈసినిమాలో రామ్ చరణ్ కొమరం భీమ్ పాత్రలో, ఎన్టీఆర్ అల్లూరి సీతారామరాజు పాత్రల్లో కనిపించనున్నారు. ఈమూవీలో కీలక పాత్రలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ నటిస్తున్నారు. జనవరి ఒకటో తేదిన నూతన సంవత్సర కానుకగా ఈ సినిమా టైటిల్‌ను అఫీషియల్‌గా ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాను వచ్చే యేడాది జూలై 30న విడుదల చేస్తామని చిత్రయూనిట్ ప్రకటించారు.

- Advertisement -