చిరుకి గ్రాండ్ వెల్‌క‌మ్ చెప్పిన ఎన్టీఆర్…

343
chiru
- Advertisement -

ఉగాది సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోష‌ల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ట్విట్ట‌ర్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో చిరుకి కింగ్ నాగార్జున‌,మోహన్ లాల్,రాధిక‌,సుహాసిని,మ‌హేష్ బాబు త‌దిత‌రులు ఇప్ప‌టికే గ్రాండ్ వెల్ క‌మ్ చెప్ప‌గా తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పందించారు.

చిరు త‌న తొలి ట్వీట్‌ని క‌రోనా మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డిచేసే దిశ‌గా చేయ‌గా రెండో ట్వీట్‌లో రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఆర్ఆర్ఆర్ మూవీపై చేశారు.

ఆర్ఆర్ఆర్ మూవీ మోష‌న్ పోస్ట‌ర్ బాగుంద‌ని రాజ‌మౌళి, ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌ల ప‌నితనం సూప‌ర్బ్ అని కొనియాడారు. దీంతో స్పందించిన ఎన్టీఆర్ మెగాస్టార్‌కి ప్ర‌త్యేక అభినంద‌న‌లు తెలిపారు.

మీ విలువైన మాట‌ల‌కి ధ‌న్య‌వాదాలు స‌ర్‌. మీ నుండి వ‌చ్చే ప్ర‌తి మాట‌లో చాలా అర్ధం ఉంటుంది. ట్విట్ట‌ర్ ప్ర‌పంచంలోకి అడుగుపెట్టిన మీకు గ్రాండ్ వెల్‌క‌మ్ చెబుతున్నాం అని ఎన్టీఆర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

- Advertisement -